ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి వరుస లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేయగా.. మంగళవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గత కొద్ది రోజులుగా పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోసారి రాష్ట్ర డీజీపీగా రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మమత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో రాజీవ్‌కుమార్‌ను మమతాబెనర్జీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది.
మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే.. చదువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో విద్యార్థులు మోటర్ సైకిల్ పంక్చర్ దుకాణాలు తెరవాలని సలహా ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఎటాక్ తర్వాత సోమవారం న్యూయార్క్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు అదరగొట్టాయి. ఏకంగా 70 శాతం పెరిగాయి.
ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రైలు ప్రమాదానికి కారణమైంది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ముప్పే జరిగి ఉండేది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.
వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల కోసం సహాయ చేసే వాహనదారులకు జరిమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్‌లకు దారి ఇచ్చేందుకు వాహనదారులు రెడ్‌సిగ్నల్ జంప్ చేస్తున్నారు.