దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీ ఉపఎన్నికల్లో భారత కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఇక బీజేపీ భయ వలయం విచ్ఛిన్నమైందని రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక నియోజకవర్గాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 4, టీఎంసీ 4, బీజేపీ 2, డీఎంకే 1, ఆప్ 1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో వివిధ పార్టీలు సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి 13 ఉపఎన్నికల స్థానాల్లో 10 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: Tea : టీ తాగితే తలనొప్పి తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రజలు రాజ్యాంగాన్ని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. దేశంలోని అణగారిన మరియు పేద జనాభా వారి హక్కులను కాపాడుకోవడానికి భారతదేశంతో పాటు నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: “శుభ్ ఆశీర్వాద్” వేడుకకు హాజరైన ప్రధాని మోడీ..