కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగికముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా ఘటనతో దేశం అట్టుడుకుతుంటే.. ఇంకోవైపు అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో చోటు... ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి.
వ్యభిచార గృహాలపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విశేషం. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
కెనడాలో ఒకేసారి 125 సంస్థలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మాల్స్, ఆస్పత్రులకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులన్నీ ప్రధానంగా యూదులు లక్ష్యంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస జోరు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో గురువారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశంలో ఏదొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కామాంధుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.