రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్తో సమావేశం అయ్యారు.
రక్షాబంధన్ రోజున ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్తున్న గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా ఆయన కమలం గూటికి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుకు భిన్నంగా అడుగులు పడుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం.
ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని... ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీబీఐ రైడ్స్‌కు భయపడి పోస్టాఫీస్ ఆఫీసర్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్‌లోకి దూరింది. లోపలికి దూరి హాయ్‌గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్‌గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ హస్తినకు చేరుకున్నారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఢిల్లీకి వచ్చారు. కమలం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎంలో తనకు ఘోరమైన అవమానం జరిగిందని చంపై సోరెన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లబుచ్చారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది.