Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్
- కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీజేపీ నిరసన
- నాయకులు... కార్యకర్తలు భారీ ప్రదర్శన
- న్యాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పటికే దేశాన్ని కుదిపేసింది. వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించిన రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
వైద్యురాలి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. గురువారం కేసు దర్యాప్తును న్యాయస్థానానికి సీబీఐ అందజేసింది. క్రైమ్ సీన్‌ను మార్చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. ఇక బాధితురాలి దహనసంస్కారాలు పూర్తయ్యాక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు
సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్‌కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా ఉంటే.. ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అంతేగాక.. అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్‌మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. శవపరీక్ష జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్‌ను సీల్ చేశారెందుకు? అని కోర్టు ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: నయన్ ను ఇలా చూస్తే తట్టుకోలేరు సుమీ!!
#WATCH | West Bengal: BJP leaders and workers stage a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital in Kolkata. pic.twitter.com/fyaxmhMxrK
— ANI (@ANI) August 22, 2024
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!