Delhi: ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్.. జవాన్లు ఏం చేశారంటే..!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన
- హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్
- సీపీఆర్ చేసి కాపాడిన జవాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో సమీపంలో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో కొన్ని సెక్షన్లు అయోమయానికి గురయ్యారు. అక్కడే ఉన్న జవాన్లు స్పందించి సీపీఆర్ చేశారు. ఇద్దరు ముగ్గురు అతడి దగ్గరే కూర్చుని సపర్యాలు చేశారు. అనంతరం సకాలంలో ఆస్పత్రిక తరలించి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Fact Check : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. స్పందించిన పోలీసులు
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
అర్షిద్ అయూబ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 దగ్గర లగేజీ ట్రాలీ పట్టుకుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడికి సకాలంలో సీపీఆర్ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే బాధితుడు తేరుకున్నాడు. ప్రాణాలను కాపాడిన జవాన్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “మా కూతుర్ని చంపేందుకు ఎవరో సంజయ్‌ని పంపారు”.. బాధితురాలి తల్లి సంచలన వాదనలు
ప్రయాణికుడు ఇండిగో విమానంలో శ్రీనగర్‌కు వెళ్లేందుకు వచ్చాడని సీఐఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. హ్యాండ్ ట్రాలీ స్టాండ్ దగ్గర అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో.. అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్ జవాన్లు తక్షణమే స్పందించారన్నారు. జవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తతతో పాటు సత్వరం చర్యలు తీసుకోవడం వల్ల ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టగలిగారని అభినందించారు.
#WATCH | A quick CPR (Cardiopulmonary resuscitation) to a passenger Arshid Ayoub by the Central Industrial Security Force's quick reaction team played a crucial role in establising his condition. Ayoub, bound for Srinagar flight from Terminal 2 of the IGI Airport on Tuesday… pic.twitter.com/b21wZG78Oa
— ANI (@ANI) August 22, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!