దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్‌లో జరిగింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్ మహిళా జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ప్రశ్న అడిగినందుకు మహిళా రిపోర్టర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో థాయ్‌లాండ్ పార్లమెంట్ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో దూసుకెళ్తోంది. ఈ వారం లాభాల్లోనే సూచీలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కారణంగా శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం కొనుగోళ్ల అండతో తిరిగి పుంజుకుని గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి.
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.
తమిళనాడు కృష్ణగిరిలోని ఓ పాఠశాలలో నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు శివరామన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌కు ముందు విషం తాగినట్లు చెప్పారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ పంపిన రహస్య లేఖను స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయం తిరస్కరించిందని రాజ్‌భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బుధవారం మహిళా వైద్యురాలి తల్లిదండ్రులను గవర్నర్ బోస్ కలిశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ సుప్రీంకోర్టు చేసిన విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ప్రకటించింది.
థాయ్‌లాండ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. థాయ్‌లాండ్‌లోని చాచోంగ్సావోలోని అడవిలో కూలిపోయింది. విమానంలో ఏడుగురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఇటలీలో విలాసవంతమైన నౌక మునక ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు.