ఇథియోపియాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. మట్టిచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండు హాల్స్ పేర్లు మార్చారు. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్, అశోక్ హాల్‌ను ఇక నుంచి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా మార్చారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ వెల్లడించింది.
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల మహిళపై మామ అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్‌లోని తన బంధువుకు పంపాడు. దీంతో బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి.
గ్రీన్‌ల్యాండ్‌లో రాయల్ పర్యటన సందర్భంగా డెన్మార్క్ క్వీన్ మేరీని ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం తెలిపింది.