దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది.
ఆగస్టు 15న జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంగేలిలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ పావురాన్ని పైకి విసిరారు. కానీ అది పైకి వెళ్లకుండా కిందపడిపోయింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్తక్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. సీబీఐ తనదైన శైలిలో విచారణ చేస్తోంది. మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం దగ్గర ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీనిపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ల భద్రతపై చర్యలు తీసుకోవాలని వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్ ప్రైమరీ స్కూల్లో నర్సరీ బాలికలపై లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఓ వైపు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంకోవైపు పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో బాధితులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు.
ఒలింపిక్స్ విజేత మను భాకర్ డ్యాన్స్‌తో సందడి చేశారు. స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. కాలా చష్మా పాటపై మను భాకర్ ఒక కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.