సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ ఎక్స్‌లో ప్రకటన చేసింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశ సర్వోన్న త న్యాయస్థానంలో కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.
హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం వరుస నష్టాలను చవిచూసింది. గత వారం సూచీలు రికార్డులు సృష్టిస్తే.. ఈ వారం అందుకు భిన్నంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా.. పోస్టుమార్టం రిపోర్టులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా పురోగతి లభించలేదు. దీంతో ఈ కేసుపై రోజుకో వదంతు వ్యాప్తి చెందడంతో అయోమయం నెలకొంది. దర్యాప్తుపై సందిగ్ధం నెలకొంది. తాజాగా బాధిత కుటుంబం.. పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. విజయవాడ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రజలు ఇంకా తేరికోకముందే.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.