హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కానీ చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకోవైపు సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది మాత్రం తేలలేదు. మొత్తానికి ప్రతిష్టంభన మధ్య ఆప్ సోమవారం తొలి జాబితాను విడుదల చేసేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ గత వారం వార్తలు హల్చల్ చేశాయి. బాధితురాలి తండ్రి ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు. వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో 22 అంతస్తుల టవర్‌ను సెకన్ల వ్యవధిలో కూల్చేశారు. లూసియానాలోని లేక్ చార్లెస్ ప్రాంతంలో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. ఇటీవల తుపాన్‌కు దెబ్బకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా కూడా స్థిరత్వం రాలేదు. దీంతో టవర్‌ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఐఎండీ ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం 28 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఆమె సర్వీస్‌ను నిలిపివేయడంతో పటు భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్‌కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూరు పెద్దలు. దీనికి నిలువెత్తు నిదర్శనం లులూ గ్రాప్ సంస్థల ఛైర్మన్ యూసఫ్ అలీనే. ఇతడు భారత బిలియనీర్. జాతీయ, అంతర్జాతీయంగా 256 హైపర్ మార్కెట్లు, మాల్స్ ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $8.9 బిలియన్లకు పైగా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా గర్వం కనిపించదు. ఒక సామాన్య వ్యక్తిలా అందరితో కలిసిపోతారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ.