టీచర్స్ డే వేడుకల్లో అస్సాంలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం విద్యార్థులంతా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులంతా సందడి సందడిగా గడిపారు. గురువులను గౌరవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే కాలేజీలో అలజడి చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి అమాంతంగా కాలేజీ బిల్డింగ్‌లోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ పరిణామంతో గురువులు సహా విద్యార్థులంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడన్న సంగతి మాత్రం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. 9 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం. అస్సాంలోని పాత్సాలాలోని అనుండోరం బోరూహ్ అకాడమీలో టీచర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఓ విద్యార్థి అమాంతంగా కళాశాల భవనం పైనుంచి దూకేశాడు. భవనం కింద 200 మందికి పైగా విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. భవనంపై పరుగు తీసి దూకేశాడు. అసలు విద్యార్థి ఎందుకు దూకేశాడన్న విషయం మాత్రం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకోగానే విద్యార్థి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోనున్నారు.
During Teachers' Day celebrations on Thursday, a student from Anandaram Baruah Academy in Pathsala,Assam, jumped from the third floor of the school building.Currently, he is undergoing treatment.The reasons behind the student's drastic action remain unclear at this time.#viral pic.twitter.com/5zyveriZE6
— Sasangka Talukdar (@Sasanka140) September 6, 2024