కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా పురోగతి లభించలేదు. దీంతో ఈ కేసుపై రోజుకో వదంతు వ్యాప్తి చెందడంతో అయోమయం నెలకొంది. దర్యాప్తుపై సందిగ్ధం నెలకొంది. తాజాగా బాధిత కుటుంబం.. పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పోలీసులు బేరసారాలు చేశారని.. కుమార్తెను చూడకుండా అడ్డుకున్నారని.. హడావుడిగా అంత్యక్రియలు జరిగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇంకోవైపు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది.
ఇది కూడా చదవండి: Weather Alert: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అయితే బీజేపీ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ దుయ్యబట్టారు. బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైందని… రాజకీయాలు చేయటం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండని మంత్రి కోరారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారని బాధిత కుటుంబం ఆరోపించింది. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. ఇలా రెండు వీడియోలు వైరల్ కావడంతో పొలిటికల్‌గా సంచలనం సృష్టించాయి. ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.