Sandip ghosh: సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు షాక్.. సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత
- సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు ఎదురుదెబ్బ
- సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కోల్‌కతా ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.
అయితే సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ సందీప్ ఘోష్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ పిటిషన్‌లో కోరారు. శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. కోల్‌కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సీబీఐ దర్యాప్తును సమర్థించింది. దీంతో సందీప్ ఘోష్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
కోల్‌కతా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజర్షి భరద్వాజ్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 23న ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఘోష్.. ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఆసుపత్రి మాజీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే విచారణను కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సందీప్ ఘోష్ మరియు అతని ముగ్గురు సహచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారని ఒక అధికారిని తెలిపారు. బెలియాఘాటాలోని ఘోష్ నివాసం మరియు హౌరా, సుభాస్‌గ్రామ్‌లోని రెండు ప్రదేశాల్లో దాడులు జరిగాయి. ఉదయం 6.15 గంటలకు ఈ ప్రదేశాలకు చేరుకున్నామని.. దాడులు చేసినట్లు వెల్లడించారు. ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబరు 2023 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అతను అక్టోబర్ 2023లో RG కర్ నుంచి కొంతకాలం బదిలీ చేయబడ్డాడు. కానీ ఒక నెలలోనే తిరిగి నియమించబడ్డాడు.
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?