దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. గత వారం సూచీలు రికార్డుల జోరు సాగించగా.. ఈ వారం మాత్రం రివర్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అమెరికా పర్యటనలో కొంత సమయం జాలిగా గడిపారు. షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇక ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 67 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం సాయంత్రం బీజేపీ ప్రకటించిండి. ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.
హర్యానాలో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.
నైజీరియన్ ఫ్లాగ్ డిజైనర్ పా తైవో మైఖేల్ అకిన్‌కున్మీ అంత్యక్రియలు ఏడాది తర్వాత కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. 87 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 29, 2023న అకిన్‌కున్మీ మరణించారు. అయితే ప్రభుత్వం గౌరవప్రదంగా ఖననం చేసేందుకు ముందుకు రాలేదు.
మహారాష్ట్రలోని థానేలో ట్రాఫిక్ జామ్ వాహనదారులకు నరకం చూపించింది. గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ యూపీఎస్సీకి సమర్పించిన దివ్యాంగ సర్టిఫికేట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ తన పేరును సర్టిఫికేట్లో మార్చుకుని మూడు వేర్వేరు పేర్లు ఉపయోగించి 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లుగా పోలీసులు తెలిపారు.
బాలీవుడ్‌లోని ధూమ్ 2 సినిమా చూసి రియల్ లైఫ్‌లో అదే రీతిగా చోరీకి ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ కేటుగాడు. పాపం.. సినిమా వేరు.. రియల్ వేరు అన్న సంగతి గుర్తించక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కుట్ర వెనుక కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
హిమాచల్‌ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు.