మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి 10 మీటర్లు లాక్కెడంతో చనిపోయాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్‌ను మరుసటి రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వినాయక చవితి పండుగ రోజున కన్నడ నడుటు దర్శన్‌కు అధికారులు 32 అంగుళాల టీవీని అందించారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ జైల్లో ఉంటున్నారు. అయితే తనకు టీవీ సౌకర్యం కల్పించాలని దర్శన్ అభ్యర్థించాడు.
అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విస్తారా ముంబై-ఫ్రాంక్ఫర్ట్ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయి. దీంతో విమానాన్ని టర్కీకి మళ్లించారు. ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లాల్సిన UK27 విమానం భద్రతా కారణాల దృష్ట్యా టర్కీలోని ఎర్జురం విమానాశ్రయానికి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో తెలిపింది.
ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. నువ్వానేనా? అన్నట్లుగా వార్ నడుస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీసుల విచారణపై ఆరోపణలు రావడంతో కోల్‌కతా హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశింది. ప్రస్తుతం ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.