Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్‌డేట్ ఇదే!
- వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్‌డేట్ ఇదే!
- గ్యాంగ్‌రేప్ వార్తలను కొట్టిపారేసిన దర్యాప్తు సంస్థ!
- త్వరలోనే కోర్టులో అభియోగాలు నమోదు చేయనున్న సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా.. పోస్టుమార్టం రిపోర్టులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలంటూ సీబీఐ వర్గాలు కొట్టిపారేసినట్లుగా తెలుస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా దర్యాప్తు బృందాలు తేల్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దర్యాప్తు సమాచారాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Wolf Attack : 200 మంది పోలీసులు, 18 మంది షూటర్లు… తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. శరీరమంతా గాయాలు, కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరినట్లుగా అనుమానాలు రేకెత్తించాయి. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత మాట్లాడుతూ.. వారంలోగా పోలీసులు కేసును తేల్చకపోతే.. సీబీఐకి అప్పగిస్తానని ప్రకటించారు. కానీ ఆందోళనలు ఉధృతం కావడంతో కోల్‌కతా హైకోర్టు స్పందించి.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. నిందితుడు సంజయ్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తేల్చారు. అంతేకాకుండా అతడి మొబైల్‌లో అశ్లీల వీడియోలు, ఫొటోలు కనిపించాయి. దీంతో అతడి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తాయి. సంజయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి గతంలో వెల్లడించారు. ఇక మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తానికి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలో న్యాయస్థానంలో అభియోగాలను అధికారులు నమోదు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ జట్ల మధ్యే.. టీమిండియా మాజీ క్రికెటర్ జోస్యం
వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని అధికారులు భావిస్తున్నారు. అయితే అంత దారుణంగా ఎలా చనిపోయింది? అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తు్న్నాయి. ప్రక్కనే పేషెంట్ల వార్డు కూడా ఉంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఎవరికీ ఎలాంటి శబ్ధాలు వినిపించలేదా? అన్నది అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు సమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. చివరిగా న్యాయస్థానం ఏం తేలుస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Nani : నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ @ 16 ఇయర్స్.. ఎవరెవరు ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!