సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ ఎక్స్‌లో ప్రకటన చేసింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో లంగ్ ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఎయిమ్స్ వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని కుటుంబ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Lavanya : హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నా రాజ్ అంటే ప్రాణం.. లావణ్య సంచలనం
సీతారాం ఏచూరి ఆరోగ్యానికి సంబంధించి ఆగస్టు 31న సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నుంచి ప్రకటన రావడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. కోలుకుని త్వరగా ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: World Biggest Flop movie : ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా.. 1083 కోట్ల నష్టం!
Update on comrade @SitaramYechury's health pic.twitter.com/iQoy8wJa8D
— CPI (M) (@cpimspeak) September 6, 2024