బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్టుండి నగదు మాయం అయితే ఎలా ఉంటుంది. తమ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు సడన్‌గా మాయం అయితే గుండె ఆగినంత పని అవుతుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? లేదంటే ఇంకెవరైనా దోచుకున్నారా? అన్న భయంతో తీవ్ర ఆందోళన చెందుతాం.
ఇజ్రాయెల్ చరిత్రలో మరొక అద్భుతమైన ఘటన ఆవిష్క్రతమైంది. గత కొన్ని నెలలుగా గాజాతో ఎడతెరిపిలేకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దాదాపుగా గాజాను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సైన్యంలో ఇదంతా ఒకెత్తు అయితే.. గురువారం ఐడీఎఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమ్మాయిను ఐడీఎఫ్ దళాలు రక్షించాయి.
గూగుల్ పే వినియోగదారులకు ఆ సంస్థ దసరా పండుగ శుభవార్త చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంకులు చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. పైగా అన్ని ఉన్నా.. ఏదొకటి మెలికపెడుతుంటారు. ఒకవేళ అన్ని ఉన్న కూడా లోన్ మంజూరు చేయడానికి ఎక్కువ రోజులు తీసుకుంటారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్‌బై చెప్పాడు.
అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
దక్షిణ తైవాన్ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కౌటిల్య ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిసిన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది.
దసరా పండుగను పురస్కరించుకుని విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. రూ. 49,999కి ఎస్ 1 స్కూటర్, రూ. 40,000 వరకు విలువైన పండుగ ఆఫర్లను వెల్లడించింది. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు, ఇర్రెసిస్టిబుల్ అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్‌ను గురువారం (అక్టోబర్ 3) నుంచి మొదలు పెట్టింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శరద్ పవార్ న్యాయ పోరాటానికి దిగారు. గడియారం గుర్తుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడియారం గుర్తుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.