మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్‌లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్‌లో పర్యటించబోతున్నారు.
దేశంలో శనివారం మరో రసవత్తర పోరుకు హర్యానా రాష్ట్రం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశ ప్రజల చూపు హర్యానాపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఆపిల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో విఫలం కావడంతో ఒక యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. స్పూఫ్ కాల్స్ ద్వారా అధికారులను బెదిరించి లగ్జరీ అనుభవించాలని ఎత్తుగడ వేసింది. కానీ పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి ఉపాధ్యాయుడిని, అతని కుటుంబాన్ని కాల్చి చంపారు.
ఇటలీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఎప్పుడూ గరం గరంగా ఉంటారు. రాజ్యసభలో ఛైర్మన్‌ను కూడా దడదడలాడిస్తుంటారు. తన పేరు పక్కన అమితాబ్ బచ్చన్ పేరును ఛైర్మన్ ఉచ్ఛరించినందుకు ఓ ఆటాడుకుంది. అంతలా ఫైర్‌బ్రాండ్‌గా ఉంటారు.
పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు.