దసరా పండుగను పురస్కరించుకుని విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. రూ. 49,999కి ఎస్ 1 స్కూటర్, రూ. 40,000 వరకు విలువైన పండుగ ఆఫర్‌లను వెల్లడించింది. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్‌పై ప్రత్యేకమైన డీల్‌లు, ఇర్రెసిస్టిబుల్ అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్‌ను గురువారం (అక్టోబర్ 3) నుంచి మొదలు పెట్టింది.
ఇది కూడా చదవండి: Iran – Israel War : ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. యుద్ధం తప్పదా..?
ఇందులో భాగంగా ఎస్1 ఎక్స్ స్కూటర్‌ను రూ.49,999కే అందిస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే లిమిటెడ్ యూనిట్లకు మాత్రమేనని తెలిపింది. అలాగే హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్, మూవ్‌ఓస్+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్‌పై డీల్స్ వంటి రూ.40వేల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం ఈ ఆఫర్ తీసుకురావడం సంతోషంగా ఉందని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, ఎండీ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు తాము ప్రకటించిన ఆఫర్లలో ఇదే అత్యుత్తమమైనదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Congress: సావర్కర్ గోహత్యకు వ్యతిరేకం కాదు, గొడ్డు మాంసం తినేవాడు.. కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..
ఓలా ఆఫర్లు ఇవే..
ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్కూటర్‌ను రూ.49,999కే అందించనున్నారు.
రూ.7వేల విలువైన 8 ఏళ్లు/80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీ ఉచితం
ఎస్1 ఎక్స్ 2kWh బ్యాటరీపై రూ.25వేల ఫ్లాట్ డిస్కౌంట్, ఎస్ 1 పోర్ట్‌ఫోలియోపై రూ.15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తామని కంపెనీ తెలిపింది.
క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.5వేల వరకు తగ్గింపు
రూ.6 వేల విలువైన మూవ్ ఓఎస్+ అప్‌గ్రేడ్, రూ.7 వేలు విలవైన హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్ ఫ్రీగా అందిస్తారు.
ఇది కూడా చదవండి: Beauty Tips: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి