Kejriwal: రేపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
- శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
- ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో బస
- పార్టీ కార్యక్రమాలకు దగ్గరకు ఉంటుందని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు సమయం దొరకడంతో శుక్రవారం నివాసాన్ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Film Chamber: కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఫిలిం ఛాంబర్
Also Read
- CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఓ పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్‌కు అధికారిక నివాసాన్ని కేటాయించాలంటూ కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Slow Eating: ఆహారాన్ని నమిలి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!