రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.
సెబీ చీఫ్ మాధబి బుచ్కి పార్లమెంటరీ ప్యానెల్ షాకిచ్చింది. పార్లమెంటరీ కమిటీ శనివారం ఆమెకు సమన్లు జారీ చేసింది. సెబీ చీఫ్‌తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అనిల్‌కుమార్ లాహోటీలను ఈ నెల 24 విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంట్‌లోని పబ్లిక్ అకౌంట్ కమిటీ (పీఎసీ) నోటీసులు జారీ చేసింది.
అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్ తెలిపారు.
క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు.
పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారిందన్నారు.
త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చని అంతా భావించారు. త్వరలోనే చమురు కంపెనీలు శుభవార్త కూడా చెప్పొచ్చని వార్తలు వినిపించాయి. వాహనదారులు కూడా గుడ్‌న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. తర్వాత జైలుకు వెళ్లి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటారా? ఓ డాక్టర్ మెడికల్ బిల్లు ఎక్కువ అడిగాడని ఏకంగా ప్రాణాలే తీసేశారు ముగ్గురు మైనర్లు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ప్రభుత్వంపై జర్నలిస్టులు చేసే విమర్శలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. గగనతలంలోనే క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం టెల్అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.