ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.
ఖరీదైన ఫోన్లు ఉచితంగా కొట్టేందుకు ఏకంగా డెలివరీ బాయ్నే లేపేశారు ఇద్దరు కేటుగాళ్లు. మొత్తానికి పాపం పండి ఇద్దరు కటకటాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియోకాన్ కేసులో పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్‌కు సెబీ షాకిచ్చింది. రూ.కోటి చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ధూత్‌తో పాటు మరో ఇద్దరికి సెబీ రూ.1 కోటి నోటీసులు జారీ చేసింది. వేణుగోపాల్ ధూత్ మరియు మరో రెండు సంస్థలకు సెబీ రూ.1.03 కోట్ల విలువైన డిమాండ్ నోటీసులు జారీ చేసింది.
దసరా పండుగ వేళ వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1న భారీగా ధర పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.48కి పెంచింది. పెంచిన ధరలు మంగళవారం (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.
హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంకర్లో 60 అడుగుల లోతులో అత్యంత భద్రంగా ఉన్న నస్రల్లాను ఇజ్రాయెల్ బంకర్ బస్టర్‌ను ఉపయోగించి అంతమొందించింది.
విద్యార్థులకు మంచి చదువు, మంచి భవిష్యత్ అందించాల్సిన విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాలను నడిపిస్తున్నాయి. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారులు వారి ధన దాహానికి బలైపోతున్నారు.
జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం చివరి విడత పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్ పాల్గొన్నారు.
దేశంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. గతేడాది కంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భారీగానే వసూళ్లు అయినట్లు తెలిపింది. దాదాపు 6.5 శాతం వసూళ్లు పెరిగాయి. రూ.1.73 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు స్పష్టం చేసింది.