దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కౌటిల్య ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిసిన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది.
ఇది కూడా చదవండి: Donald Trump: ‘‘మీరు, కమలా హారిస్ ఎప్పటికీ నాకు ప్రెసిడెంట్ కాలేరు’’.. ట్రంప్‌కి ఇండియన్ యూజర్ రిఫ్లై వైరల్..
ప్రాముఖ్యంగా ఈ సదస్సులో కాన్‌క్లేవ్ గ్రీన్ ట్రాన్సిషన్, జియో-ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, అభివద్ధికి సంబంధించిన చిక్కులు, విధానపరమైన చర్యలు, సూత్రాలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సదస్సు శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ సదస్సు జరగనుంది. ప్రారంభ ఉపాన్యాసం ప్రధాని మోడీ చేయనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వక్తులు ఈ సదస్సులో పాల్గొంటారు. కౌటిల్య ఆర్థిక సదస్సును ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Apple Festive Sale: ఆపిల్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. ఐఫోన్లపై భారీ ఆఫర్లు