ఇజ్రాయెల్ చరిత్రలో మరొక అద్భుతమైన ఘటన ఆవిష్క్రతమైంది. గత కొన్ని నెలలుగా గాజాతో ఎడతెరిపిలేకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దాదాపుగా గాజాను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సైన్యంలో ఇదంతా ఒకెత్తు అయితే.. గురువారం ఐడీఎఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమ్మాయిను ఐడీఎఫ్ దళాలు రక్షించాయి. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Google Pay Loans: గూగుల్ పే వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.50లక్షల లోన్
2014లో 11 ఏళ్ల ఫౌజియా అమీన్ సిడో అనే బాలికను ఇరాక్ నుంచి కిడ్నాప్ చేసి సిరియాకు తీసుకెళ్లారు. అనంతరం పాలస్తీనా ఐసిస్ మద్దతుదారులకు అమ్మేశారు. అప్పటి నుంచి ఆమెను గాజాలో బందీగా ఉంచారు. అయితే గత కొద్ది నెలలుగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువతిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సురక్షితంగా రక్షించింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఆమెను హత్తుకుని ఆనందభాష్పాలు చిందించారు. ఫౌజియా అమీన్ సిడోను 11 ఏళ్ళ వయసులో బందీగా తీసుకెళ్లి గాజాలోని టెర్రర్ గ్రూప్ మద్దతుదారుడికి అమ్మేశారని, అక్కడ ఆమెను 10 సంవత్సరాల పాటు బంధించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్నాళ్లపాటు ఆమె పాలస్తీనా హమాస్-ఐఎస్ఐఎస్ సభ్యుడి చేతిలో బందీగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్ 7న హమాస్ దళాలు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లారు. అందులో కొందరిని విడిచిపెట్టారు. మరికొందరిని వారి దగ్గరే బందీలుగా ఉంచుకున్నారు. దీంతో వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తూనే ఉంది. ఏడాది అయినా ఇంకా ఆచూకీ లభించలేదు.
ఇది కూడా చదవండి: Veekshanam Teaser: ఆసక్తికరంగా “వీక్షణం” టీజర్
Fawzia, a Yazidi girl kidnapped by ISIS from Iraq and brought to Gaza at just 11 years old, has finally been rescued by the Israeli security forces.
For years, she was held captive by a Palestinian Hamas-ISIS member.
She has now been reunited with her family. Her story is a… pic.twitter.com/nkVotqYdov
— David Saranga (@DavidSaranga) October 3, 2024