అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ICICI Bank Fraud: ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్మాల్.. ఖాతాదారుల ఆందోళన
గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో మెక్సికన్ సైనికులు హఠాత్తుగా ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో ఆరుగురు వలసదారులు చనిపోయారు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నారు. గమ్యస్థానానికి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనలో పాల్గొన్న ఇద్దరు సైనికులను అధికారులు విధుల నుంచి తప్పించినట్లు మెక్సికో రక్షణ శాఖ బుధవారం తెలిపింది. ఇద్దరు సైనికులు ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు తేలిందన్నారు. నలుగురు వలసదారులు సంఘటనా స్థలంలో చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
ఇదిలా ఉంటే వలసదారులు కాల్పుల వల్ల మరణించారా లేదా ట్రక్కులో ఏవైనా ఆయుధాలు దొరికాయా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మొత్తం ట్రక్కులో 33 మంది వలసదారులు ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాంతం స్మగ్లింగ్‌కు కేంద్రంగా మారింది. వలసదారులు తరచుగా సరుకు రవాణా ట్రక్కుల ద్వారా చేస్తుంటారు. ఆయుధాలతో కాల్పులు జరిపిన ఇద్దరు సైనికులను విధుల నుంచి తప్పించామని.. విచారణ కొనసాగుతోందని ఆ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Typhoon Krathon: దక్షిణ తైవాన్‌ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి