హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.
హర్యానాలోని పంచకులలో ఘోర ప్రమాదం జరిగింది. 45 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు లోయలో పడింది. చిన్నారుల బస్సులోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. టిక్కర్ తాల్ సమీపంలో బస్సు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయింది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. కేంద్రం అధికారికంగా ఆమె పేరును ప్రకటించింది. ఇక జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. విజయ కిషోర్ రహత్కర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఎవరైనా కొనప్రాణంతో ఉన్నా.. కోమాలో ఉన్నా.. ఇక బతకడేమోనని కుటుంబ సభ్యులు అవయవ దానం చేస్తుంటారు. ఇలా ఏదో ఒక చోటు జరుగుతూనే ఉంటాయి. అయితే అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి పరిశీలిస్తుండగా పేషెంట్ సడన్ షాకిచ్చాడు. అతడు బతికే ఉన్నాడని గుర్తించి డాక్టర్లు షాక్అయ్యారు.
సమాజంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తారన్న చందంగా బెంగళూరులో డేటింగ్ యాప్ పేరుతో ఓ మహిళ.. ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌ను నిలువునా ముంచేసింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా రూ.50 లక్షలు సమర్పించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఫైనాన్షియల్ మార్కెట్‌పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
తమిళనాడులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య అగ్ని రాజుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలకకుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన చేసింది.