కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు. పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాయనాడ్ కలెక్టరేట్‌కు రోడ్‌షో ద్వారా వెళ్లి ప్రియాంక నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Ananya Nagalla: అనన్య నాగళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల భారీ విజయంతో గెలుపొందారు. దీంతో రాయ్‌బరేలీలో కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ బైపోల్ ఎన్నిక వచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Lanka Dinakar: 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు లక్ష్యం
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఎన్నికల సంఘం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలు.. నకిలీ బెదిరింపుల.. కోట్లలో నష్టం..