హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులకు ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది.
దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం మరువక ముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వేశాఖ తెలిపింది.
ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు.
ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తు్న్నాయి. వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇలా ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా మేథోమథనం చేస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా ముఖ్యమైన పండగలు వచ్చినప్పుడు ముందుగానే ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకుంటారు. లేదంటే ట్రైన్ ఎక్కడానికి కూడా చోటుండదు. ఫెస్టివల్స్ సమయాల్లో రిజర్వేషన్ బోగీలు కూడా కిక్కిరిసిపోతుంటాయి.
గతేడాది అక్టోబర్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు వార్ కొనసాగిస్తున్నాయి. హమాస్ సొరంగాలు నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. అంతకంటే పెద్దవైన హిజ్బుల్లా సొరంగాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ దళాలు విడుదల చేశాయి.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పోలీసులకు తొలి ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల పర్యటన సమయంలో రోడ్లపై ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, లాఠీలు చూపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయరాదని ఆదేశించారు. తన రాకపోకల కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.