ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ 15 రాకెట్లు ప్రయోగించిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కొన్ని రాకెట్లను అడ్డగించగా.. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అలాగే ఆస్తి నష్టాలు కూడా పెద్దగా జరగలేదని పేర్కొంది. ఐడీఎఫ్ డ్రోన్ రాకెట్ లాంచర్లను కూల్చివేసేసింది
హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తు్న్న ఇజ్రాయెల్ గురువారం మరో చరిత్ర సృష్టించింది. అగ్ర నాయకులందరినీ ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సూత్రదారి యాహ్యా సిన్వార్ మాత్రం చేతికి చిక్కలేదు. అతగాడి కోసం ఐడీఎఫ్ దళాలు ఎంత వెతికినా దొరకలేదు.
మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. మనీలాండరింగ్ కేసులో 2022, మే నెలలో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు.
ఇకపై ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తీరాల్సిందేనని అమెజాన్ హెచ్చరించింది. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని వారు ఇతర కంపెనీల్లో పని చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ వార్నింగ్ ఇచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం కూడా ప్రారంభంలో నష్టాలతో మొదలైనా.. అనంతరం క్రమక్రమంగా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్ వేదికగా ఎటువంటి యాడ్స్ అందించని ప్లాట్‌ఫామ్ త్వరలోనే ప్రకటనలు ఇచ్చేందుకు చూస్తోంది.
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది తెప్పపై వెళ్తున్నారు. హఠాత్తుగా అది అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది.
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.