దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. గత వారం మాదిరిగానే వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. అమెరికా ఎన్నికల అనిశ్చితి.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో మన మార్కెట్ వరుస నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ పురస్కరించుకుని ఐదు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు (శనివారం) సెలవులు ప్రకటించాయి.
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే వయనాడ్ బైపోల్ మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ తొలిసారి ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయడమే కారణం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తండ్రి లేఖ రాశాడు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖలో తెలిపారు. తమ కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
తాజాగా పెరిగిన ఆభరణాల ధరలు చూసి పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది. ముహూర్తాలు దగ్గర పడడంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధపడుతుండగా అమాంతంగా ఒక్కసారి పెరిగిన ధరలు చూసి అవాక్కు అవుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి నుంచి కీలక ప్రకటన వచ్చింది. చమురు కొరత లేదని.. ధరలు తగ్గే అవకాశం ఉందని వాహనదారులకు కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు.
బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేరళ చేరుకున్నారు. రాష్ట్ర నాయకులు భారీ స్వాగతం పలికారు. బుధవారం వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.