జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. కేంద్రం అధికారికంగా ఆమె పేరును ప్రకటించింది. ఇక జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. విజయ కిషోర్ రహత్కర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Wife Vs Husband: పబ్బుకు పోయి ఇరుక్కున్న భర్త.. ఇంటికి రా నీ సంగతి చెప్తా..
విజయ కిషోర్ రహత్కర్ పదవీకాలం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రహత్కర్ నియామకంతో పాటు ఎన్‌సీడబ్ల్యూలో సభ్యులను కూడా నియమించింది. అర్చన మజుందార్ పదవీ కాలం కూడా మూడేళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
ఇది కూడా చదవండి: Bomb Threats: అసలేం జరుగుతోంది.. 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
Vijaya Kishore Rahatkar has been appointed as the new Chairperson of the National Commission for Women.
Dr Archana Majumdar has been appointed as the new Member of the National Commission for Women. pic.twitter.com/j3cGgnD6rT
— ANI (@ANI) October 19, 2024