టెక్ సిటీ బెంగళూరును భారీ వరద ముంచెత్తింది. మంగళవారం రికార్డ్ స్థాయిలో వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిన్నెలతో నీళ్లు బయటకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనం అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. ముగింపులో మాత్రం లాభాలు ఆవిరైపోయాయి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్కి ఊరట లభించింది. అనుచిత ఆరోపణలపై మాధబికి కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. కేంద్రం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని పేర్కొంది.
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) వింత ఆచారం జరిగించింది. ఏదో ఘన కార్యం చేసినట్లు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు తానుగా వివాహం చేసుకోనున్నట్లు పోస్టు చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
డిసెంబరు 3న లడఖ్ గ్రూపులతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం తన నిరాహార దీక్షను ముగించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే కార్యకర్తలను కలుసుకుని హోంశాఖ నుంచి లేఖను అందజేశారు
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో సందడి చేశారు.
ఉత్తర గాజాలో జరిగిన పేలుడులో అత్యంత సీనియర్ ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్లలో ఒకరైన కల్నల్ అహ్సన్ దక్సా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. జబాలియా ప్రాంతంలో అహ్సన్ దక్సాను పేలుడు పదార్ధం తాకడంతో ఈ సంఘటన జరిగిందని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.
మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు శివసేన(యూబీటీ) నేతలు తెలిపారు. సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందని వార్తలు షికార్లు చేశాయి.
క్యాబ్‌లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.