ఎవరైనా కొనప్రాణంతో ఉన్నా.. కోమాలో ఉన్నా.. ఇక బతకడేమోనని కుటుంబ సభ్యులు అవయవ దానం చేస్తుంటారు. ఇలా ఏదో ఒక చోటు జరుగుతూనే ఉంటాయి. అయితే అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి పరిశీలిస్తుండగా పేషెంట్ సడన్ షాకిచ్చాడు. అతడు బతికే ఉన్నాడని గుర్తించి డాక్టర్లు షాక్అయ్యారు.
ఇది కూడా చదవండి: Bengaluru: డేటింగ్ యాప్ పేరుతో బురిడీ.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్
అమెరికాకు చెందిన థామస్ టీజే హూకర్‌కు డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండె ఆగిపోయింది. కెంటకీలోని ఓ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీంతో అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ క్రమంలో అవయవాల పనితీరును నిర్ధారించుకునేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తున్న క్రమంలో బాధితుడిలో కదలికలు కనిపించాయి. థియేటర్ లోనికి వెళ్లే సరికి అతడి కళ్ల నుంచి నీరు కారడం, చేతులను తడుముతున్నట్లు గమనించిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడున్న ఇద్దరు వైద్యులు అవయవాలను తొలగించేందుకు నిరాకరించినట్లు సహాయకురాలిగా ఉన్న వ్యక్తి వెల్లడించారు. అయినప్పటికీ ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు అవయవాల తొలగింపు ప్రక్రియ నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Salman Khan : పెరిగిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. బిగ్‌బాస్‌కు చేరుకున్న సల్మాన్!
ఇదిలా ఉంటే హూకర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత కోలుకుని క్షేమంగా ఉన్నాడు. కొన్ని సమస్యలు మినహా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే సజీవంగా ఉన్న వ్యక్తి అవయవాలు సేకరించేందుకు సిద్ధమయ్యామని వచ్చిన ఆరోపణలను కేఓడీఏ అధికారులు తోసిపుచ్చారు. దీనిపై ఆ రాష్ట్ర వైద్యశాఖ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అమెరికన్ మీడియా తాజాగా వెల్లడించింది.