ఫైనాన్షియల్ మార్కెట్‌పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్‌పై మాత్రం గట్టి నిఘా ఉంచడంతో పాటు అవసరమైనప్పుడు నియంత్రణ చర్యలు తీసుకుంటుందన్నారు. నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ సహా నాలుగు సంస్థలు రుణాలు మంజూరు చేయకుండా ఆంక్షలు విధించిన మరుసటి రోజు ఆర్బీఐ చీఫ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Snakes and Ladders: మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’
ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్‌కు చెందిన నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌తో సహా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అక్టోబర్ 21 నుంచి కొత్త రుణాలను మంజూరు, పంపిణీ చేయొద్దని ఆదేశించింది. వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ ఎక్కువగా ఉండటం, వడ్డీరేట్లు పరిమితికి మించి అధికంగా వసూలు చేస్తున్నాయని గమనించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bahraich violence: బహ్రైచ్ నిందితులకు మరో షాక్ ఇచ్చిన సీఎం యోగి..