పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు.
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అంబేద్కర్ వివాదం నడుస్తోంది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ బదులు.. భగవంతుని పేరు తలుచుకుంటే స్వర్గంలోనైనా పుణ్యం దక్కుతుందని వ్యాఖ్యానించారు.
భూమ్మీద నూకలుంటే.. ఎంత ప్రమాదమైనా బయటపడతారని అప్పుడప్పుడూ పెద్దలు అంటుంటారు. చాలా మంది చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. ఒకవేళ చూడకపోతే.. తాజాగా జరిగిన ఓ కారు ప్రమాదం మాత్రం అక్షరాల నిజమని చెబుతుంది.
ప్రధాని మోడీ కువైట్ చేరుకున్నారు. కువైట్ రాష్ట్ర అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం కువైట్ చేరుకున్నారు.
పార్లమెంట్లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.