Bengaluru: ఐఐఎం-బీలో కుల వివక్ష.. డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు
- బెంగళూరు ఐఐఎం-బీలో కుల వివక్ష
- డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై ఎఫ్‌ఐఆర్
- బాధితుడికి న్యాయమే చేశామని సంస్థ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం మరియు న్యాయ సంహిత నిబంధనలను ఐఐఎంబీ సిబ్బంది ఉల్లంఘించారని పేర్కొంది.
ఐఐఎంబీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గోపాల్ దాస్.. కుల వివక్ష కారణంగా తాను ప్రమోషన్ కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిది మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన కులాన్ని కార్యాలయంలో బహిర్గతం చేశారని.. కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. తనకు దక్కాల్సిన అవకాశాలను నిరాకరించారని.. అంతేకాకుండా మానసిక వేధింపులతో పాటు బెదిరింపులకు గురి చేశారని దాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారమే వారంతా అరెస్ట్‌పై స్టే తెచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌ను సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశించింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశామని.. అయితే ఎఫ్ఐఆర్‌లో నమోదైన పేర్లు గలవారు అదేరోజు సాయంత్రం కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందారని తెలిపారు. కానీ తమకు ఇంకా ఆర్డర్ కాపీ అందలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
అయితే కొంత మంది విద్యార్థులు.. దాస్‌పై వేధింపుల ఫిర్యాదులు చేశారని.. అందుకోసమే దాస్ ప్రమోషన్ దరఖాస్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐఐఎంబీ స్పష్టం చేసింది. గోపాల్ దాస్.. 2018లో ఐఐఎంబీలో చేరినప్పటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అతని అర్హతలను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టునే ఆఫర్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అర్హతలు, అనుభవం, 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతం, పరిశోధన, బోధన మరియు వివిధ ప్రోత్సాహకాలను పొందారని తెలిపింది. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్‌లో రివ్యూ బోర్డు చైర్‌పర్సన్, కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు కూడా అప్పగించినట్లు సంస్థ వివరించింది. ఇక బోధనలో అయితే దాస్‌కు నచ్చిన కోర్సులనే బోధించాడని పేర్కొంది. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని ఐఐఎంబీ తెలిపింది.
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!