దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను అతుల్ సుభాష్ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు.
పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు.
ఓఆర్ఆర్ టెండర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం నుంచి హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నవంబర్ 25న ప్రారంభమైన సమావేశాలు ఏ రోజు సాఫీగా సాగలేదు.
నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హాలిడే ఫెయిర్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు.
అమెరికా టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది.
ఆహ్లాదం.. విషాదమైంది. ఆనందం.. ఊపిరి తీసింది. ఎంతో ఉల్లాసంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒకే ఒక్క కుదుపు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముంబై తీరంలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనతో తీరం దు:ఖ సముద్రం అయింది.