భూమ్మీద నూకలుంటే.. ఎంత ప్రమాదమైనా బయటపడతారని అప్పుడప్పుడూ పెద్దలు అంటుంటారు. చాలా మంది చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. ఒకవేళ చూడకపోతే.. తాజాగా జరిగిన ఓ కారు ప్రమాదం మాత్రం అక్షరాల నిజమని చెబుతుంది.
రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అతివేగంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టి ఓ గేటుపైకి ఎక్కింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆశ్చర్యమేంటంటే.. అందులో ఉన్న ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సేఫ్‌గా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఎస్‌యూవీ కారులో ఐదుగురు వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే కారు డ్రైవర్ టర్న్ తీసుకోవడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. సెకన్ల వ్యవధిలో వాహనం కనీసం ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. కార్ షోరూమ్ ముందు తలక్రిందులుగా వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.
ఇది కూడా చదవండి: Fact Check: కొత్త 500,1000 నోట్లపై మోడీ కీలక ప్రకటన.. వీడియో వైరల్..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ ముందుగా కారు నుంచి దూకేశాడని తెలిపారు. షోరూం ముందు కారు ఆగిన తర్వాత మిగిలిన నలుగురు ప్రయాణికులు కూడా బయటకు వచ్చేశారని చెప్పారు. అనంతరం ప్రయాణికులు ఉల్లాసంగా షోరూమ్ లోపలికి వెళ్లి దయచేసి తమకు టీ ఇవ్వాలని కూడా అడగడం విశేషం. ఈ విషయాన్ని షోరూమ్ సిబ్బంది తెలిపారు. ప్రయాణికులు నాగౌర్ నుంచి బికనీర్‌కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl
— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024