ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో గురువారం బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కలిసి హాజరు కావడం ఇంట్రెస్టింగ్ మారింది.
కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి పార్లమెంట్ ఆవరణలో అనూహ్యమైన పరిణామం ఎదురైంది. ఓ బీజేపీ మహిళా ఎంపీ ఇచ్చిన బ్యాగ్‌తో అవాక్కయ్యారు. ప్రియాంకా గాంధీకి ‘1984’ బ్యాగ్‌ను బహుమతిగా బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి అందజేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అనుమానిత బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం బాణసంచాపై "శాశ్వత నిషేధం" విధించారు.
భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్‌సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు.