పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం తీరు కారణంగానే సమయం వృథా అయిందని తెలిపారు. నిరసనలు, ఆందోళనలతో సమయం గడిచిపోయిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి అదానీ లంచాల వ్యవహారంపై కాంగ్రెస్ పోరాటం చేసింది. అదానీపై విచారణ జరపాలంటూ నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొని వాయిదాలు పడిపోయాయి. ఇక రాజ్యసభలో కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్ పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో లాభం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో అంబేద్కర్‌ను అవమానించారంటూ బర్త్‌రఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గురువారం ఎంపీల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇక శుక్రవారం అర్థాంతరంగా ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిపోయాయి.
ఇలా పార్లమెంట్ సమావేశాలు వాయిదాలు.. ఆందోళనలతో సమయం వృథా అయిపోయింది. అధికారిక సమాచారం ప్రకారం లోక్‌సభ మొదటి సెషన్‌లో 5 గంటల 37 నిమిషాలు వృథా కాగా.. రెండవ సెషన్‌లో గంటా 53 నిమిషాలు, ముగింపు సెషన్‌లో ఆశ్చర్యకరంగా 65 గంటల 15 నిమిషాలు లోక్‌సభ కోల్పోయింది. ఇలా మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం వృథా అయిపోయింది. లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.97.87 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలకు మించి ఖర్చు చేయడంతో ఆర్థికపరమైన చిక్కులు గణనీయంగా పెరిగాయి.
#WinterSession #WinterSession2024 #Parliament #LokSabha #18thloksabhasession pic.twitter.com/7ZDKCR6MzZ
— LOK SABHA (@LokSabhaSectt) December 20, 2024
#WATCH | Delhi | On the Winter session of Parliament, Union Parliamentary Affairs Minister, Kiren Rijiju says, "In this session of Parliament, there were 20 sittings of Lok Sabha and 19 sittings of Rajya Sabha in 26 days. 4 and 3 bills were passed in Lok Sabha and Rajya Sabha,… https://t.co/C6jKFd7cdZ
— ANI (@ANI) December 20, 2024