ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుత చర్యల కారణంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
టర్కీలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికేసిర్ ప్రావిన్స్‌లో ఉన్న క్యాప్సూల్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్నారు. దీంతో ఆయన చివరి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు.
పశ్చిమాసియాలో సెప్టెంబర్ 17న ఊహించని విపత్తు తీవ్ర కలకలం రేపింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో హఠాత్తుగా హిజ్బుల్లా చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయి.
యూపీలో ఓ ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడి ప్రైవేటు పార్ట్‌ను కత్తిరించేసింది. దీంతో బాధితుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది.
దేశంలో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్‌లు హడలెత్తిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు సరికొత్త దురాగతాలకు పాల్పడుతున్నారు. వారి వలలో చిక్కుకుంటున్న ప్రజలు విలవిలలాడిపోతున్నారు.