చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయ వాది చార్లీ కిర్క్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు చార్లీ కిర్క్ సమాధి రహస్యంగా ఉంచడం.. ఇంకోవైపు చార్లీ కిర్క్‌ను కుటుంబ సభ్యులు, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందమే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చార్లీ కిర్క్ స్నేహితురాలిగా చెప్పుకుంటున్న కాండేస్ ఓవెన్స్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
అగ్ర రాజ్యం అమెరికా పౌరసత్వం కావాలనుకుంటున్నారా? యూఎస్‌లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. అమెరికా పౌరసత్వం పొందేందుకు.. స్థిర నివాసం ఉండేందుకు సువర్ణావకాశం వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోడీ-ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార కమిషన్‌లో ఖాళీగా ఉన్ని ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇద్దరి సమావేశంలో ఎనిమిది స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు.
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది.
ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. కానీ మచాడోకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మచాడోపై వెనిజులా దేశం ఆంక్షలు విధించింది. దీంతో ఆమె అవార్డు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది.
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడంతస్తుల టెక్స్టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్ దంపతుల మధ్య ఏదో జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. సంసారంలో గొడవలు మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రెస్టారెంట్లో ఇద్దరూ గొడవపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గుజరాత్లో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిను ఇష్టపడ్డారు. ఇది ఒకరికి రుచించలేదు. అంతే అడ్డుగా ఉన్న స్నేహితుడిని అంతమొందించాడు. ఈ ఘటన నఖత్రానాలోని మురు గ్రామంలో చోటుచేసుకుంది.