అగ్ర రాజ్యం అమెరికా పౌరసత్వం కావాలనుకుంటున్నారా? యూఎస్‌లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. అమెరికా పౌరసత్వం పొందేందుకు.. స్థిర నివాసం ఉండేందుకు సువర్ణావకాశం వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1 మిలియన్‌తో నేరుగా పౌరసత్వాన్ని పొందే అవకాశాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లుగా వెల్లడించారు. ఇది గ్రీన్ కార్డు మాదిరిగానే 1 మిలియన్ చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వంతో పాటు స్థిర నివాసం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Off The Record: జగన్ పోగొట్టుకున్న చోటే వెతుకుంటున్నారా..?
వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్ రూమ్‌లో వ్యాపార నాయకులతో సమావేశం అయినప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గోల్డ్ కార్డు ద్వారా అగ్రశ్రేణి ప్రతిభావంతులను అమెరికా ఆకర్షించనుంది. అంతేకాకుండా ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుందని ఆశిస్తోంది. గోల్డ్ కార్డు ద్వారా వచ్చే ఆదాయమంతా ప్రభుత్వానికే చేరుతుందని ట్రంప్ తెలపారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: చంద్రబాబు చెప్పినట్టు పవన్ కల్యాణ్ వికృత క్రీడ..! అంబటి ఫైర్
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల కోసం వీసాలు అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న వ్యక్తులకు గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో అమెరికా చేరింది. గోల్డ్ కార్డు ద్వారా సంపన్న వ్యక్తులను ఆకర్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. తాజా కార్యక్రమంతో చైనా, భారతదేశం, ఫ్రాన్స్ దేశాలకు చెందిన అగ్రశ్రేణులు గోల్డ్ కార్డులు పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది.