Erika kirk: చార్లీ కిర్క్ హత్యపై స్నేహితురాలు సంచలన ఆరోపణలు.. ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం
- సంచలనంగా మారిన చార్లీ కిర్క్ హత్య వ్యవహారం
- సమాధి రహస్యంగా ఉంచడంపై ఆరోపణలు
- తాజాగా చార్లీ కిర్క్ స్నేహితురాలు సంచలన ఆరోపణలు
- ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎరికా కిర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయ వాది చార్లీ కిర్క్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు చార్లీ కిర్క్ సమాధి రహస్యంగా ఉంచడం.. ఇంకోవైపు చార్లీ కిర్క్‌ను కుటుంబ సభ్యులు, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందమే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చార్లీ కిర్క్ స్నేహితురాలిగా చెప్పుకుంటున్న కాండేస్ ఓవెన్స్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్
Also Read
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
చార్లీ కిర్క్ హత్య వెనుక ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యూఎస్ మిలిటరీ, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందం సహా వివిధ గ్రూపుల ప్రమేయం ఉందని కాండేస్ ఓవెన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంపింది ఒకరైతే.. టైలర్ రాబిన్సన్ అరెస్ట్ చేశారని.. ఇది అసలు కరెక్టే కాదని వ్యాఖ్యానించారు. తొలుత హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఆరోపించగా.. అనంతరం ఫ్రెంచ్ ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పారు. అటు తర్వాత టర్నింగ్ పాయింట్ యూఎస్ మోసం చేసిందని.. అంతేకాకుండా ఇందులో యూఎస్ సైన్యం పాత్ర కూడా ఉందంటూ ఆరోపించింది.
ఎరికా కిర్క్ ఆగ్రహం..
చార్లీ కిర్క్ హత్య, రహస్య సమాధిపై వస్తున్న ఆరోపణలపై ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌తో ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. కాండేస్ ఓవెన్స్ పేరు ప్రస్తావించకుండానే మండిపడ్డారు. చార్లీ కిర్క్ హత్యపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను దేశ న్యాయ ప్రక్రియను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తన భర్తతో కలిసి పని చేసిన వ్యక్తులపై ఆరోపణలు చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారని.. ఈ విషయంలో మౌనంగా ఉండదల్చుకోలేదన్నారు. తన భర్తతో పని చేసిన వారంతా ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్నారని.. ఏం జరిగిందో తెలియక దు:ఖిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తిరిగి నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. తనకు.. తన భర్తకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు డిమాండ్ చేశారు. ఇక తన భర్త సమాధి అపవిత్రం కాకుండా ఉండేందుకు రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా పౌరసత్వానికి ‘గోల్డెన్ ఆఫర్’.. శుభవార్త చెప్పిన ట్రంప్
ఫాక్స్ న్యూస్‌లో ఎరికా కిర్క్ మాట్లాడిన సంభాషణ చూశానని.. పేరు ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది తనపైనేనని కాండేస్ ఓవెన్స్ తెలిపారు. ఈ విషయంలో ఎవరూ చింతించకండి అన్నారు.
మొత్తానికి చార్లీ కిర్క్ హత్య వ్యవహారం తాజాగా తీవ్ర దుమారం రేపుతోంది. సమాధి రహస్యంగా ఉంచడం, ఇంకోవైపు చార్లీ కిర్క్ బృందమే చంపేశారంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మరోవైపు ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఎరికా కిర్క్ గట్టిగా కౌగిలించుకోవడం కూడా సంచలనంగా మారింది. అయితే కుట్ర కోణాలను ప్రజలు తిప్పికొట్టాలని ఎరికా కిర్క్ కోరారు.
Erika Kirk blast those who accuse her family and TPUSA team of being "involved" in Charlie Kirk's assassination
— Breaking911 (@Breaking911) December 10, 2025
JUST IN: A giddy and smiling Candace Owens responds to Erika Kirk’s comments from today on Fox News.
“Super fun show today. You're probably seeing the clips … it's about me.”
“It's indirect, but it's also about me. And don't worry, in case you think it's not about me, she is… pic.twitter.com/WBeHBDTMwn
— Collin Rugg (@CollinRugg) December 10, 2025
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!