అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్ దంపతుల మధ్య ఏదో జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. సంసారంలో గొడవలు మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ గొడవపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!
ఆ మధ్య యూఎస్ టర్నింగ్ పాయింట్ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ వాన్స్..ఎరికా కిర్క్‌ను గట్టిగా కౌగిలించుకున్నారు. అంతేకాకుండా ఆ కార్యక్రమంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా అమెరికా సెకండ్ లేడీ అయిన ఉషా వాన్స్ రెండు సార్లు అధికారిక కార్యక్రమంలో ఎంగేజ్‌మెంట్ ఉంగరం లేకుండానే హాజరయ్యారు. దీంతో వదంతులు మరింతగా వ్యాపించాయి. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ గొడవపడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫొటోలో జేడీ వాన్స్ తెల్లటి టీ-షర్టులో ఉన్నారు. ముఖం చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. ఎదురుగా కూర్చున్న ఉషా వాన్స్ తల వంచి.. చేయి ముఖం మీద పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. రికార్డ్ స్థాయిలో సిల్వర్ ధర
వైరల్ అవుతున్న ఫొటోపై జేడీ వాన్స్ స్పందించారు. ‘‘నేను నా భార్యతో గొడవ పడటానికి బహిరంగంగా వెళ్ళినప్పుడు ఎప్పుడూ లోదుస్తుల చొక్కా ధరిస్తాను.’’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. అయితే ఈ ఫొటోపై అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రిపబ్లికన్ల పార్టీలో పరిస్థితులు బాగోలేవని వ్యాఖ్యానిస్తే.. మరొకరు ఇది ఏఐ జనరేటెడ్ ఫొటో అయి ఉండొచ్చని పేర్కొన్నారు.
2014లో జేడీ వాన్స్-ఉషా వాన్స్‌కు వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఏప్రిల్‌లో భారత్ పర్యటనకు కూడా వచ్చారు. అయితే ఆ మధ్య ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. అనంతరం ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను జేడీ వాన్స్ గట్టిగా కౌగిలించుకున్నారు. దీంతో జేడీ వాన్స్-ఉషా వాన్స్ దంపతులు విడిపోతున్నారంటూ పుకార్లు నడిచాయి. తాజాగా ఇద్దరు గొడవ పడుతున్న ఫొటో వైరల్ అవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.