ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి భార్య దివ్య గెహ్లాట్ వరకట్న వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-16సీ ఫైటర్ జెట్ కూలిపోయింది. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాడినో కౌంటీలోని ట్రోనా విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా 200కి పైగా ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. హఠాత్తుగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో ముఖ్యమైన ప్రయాణాలు ఉన్న వారంతా లబోదిబో అంటున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు భారత్‌కు రానున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో మాదిరిగానే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కూడా కమలనాథులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ప్రధాని మోడీని కలిశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు
జార్ఖండ్‌లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది.