బంగారం ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం ఝలక్ ఇచ్చాయి. క్రిస్మస్ పండగ సమయానికైనా తగ్గుతాయేమోనని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.
భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. హెచ్1-బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్-1బీ వీసాల అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్లిపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు హింసిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు.
ఏ జంటైనా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదు. అంతేకాని పెళ్లి చేసుకున్నాక మాటిమాటికీ గొడవలు పడి విడాకుల కోసం కోర్టు మెట్టులు ఎక్కితే మాత్రం అందరికీ సమస్యే.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓటర్ ప్రత్యేక సర్వేపై కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు పబ్లిక్‌గానూ రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీ న్యాయస్థానంలో చుక్కెదురైంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ప్లేయర్ కిరణ్ సూరజ్ దాధే ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు ఉద్యోగం లేకపోవడం, వివాహం విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో మానసికంగా కృంగిపోయింది.
పార్లమెంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. తాజాగా ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ స్పందించారు.