Machado: నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
- నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
- ఈ ఏడాది మచాడోను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- మచాడోపై ఆంక్షలు విధించిన వెనిజులా ప్రభుత్వం
- రహస్యంగా నార్వే చేరుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. హోటల్‌లోని బాల్కనీ దగ్గర అందరికీ చేతులు ఊపుతూ.. అభివాదం చేస్తూ.. చేతులు ఎత్తి నమస్కరిస్తూ కనిపించారు. చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మద్దతుదారులతో కలిసి పాటలు కూడా పాడారు. ఈ ఏడాది జనవరిలో ప్రత్యక్షమైన ఆమె… తిరిగి ఇన్ని నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించారు.

Also Read
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి మచాడోను వరించింది. బుధవారం నార్వేలో నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మచాడో గైర్హాజరయ్యారు. ఆమె చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తామంటూ వెనిజులా అటార్నీ జనరల్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్!
అయినా కూడా మచాడో అత్యంత రహస్యంగా నార్వేలోని ఓస్లోకు చేరుకున్నారు. గ్రాండ్ హోటల్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. బాల్కనీ నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. నోబెల్ శాంతి బహుమతి తీసుకునేందుకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తనకు తెలుసు అని మీడియాతో అన్నారు. అయినా కూడా రహస్యంగా నార్వే చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన మద్దతుదారులను కలిసేందుకు బారికేడ్లు దాటుకుంటూ వెళ్లారు. మరియా.. మరియా అంటూ పెద్ద పెద్దగా అరుపులు.. కేకలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్
మచాడో.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. చాలా కాలంగా ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిషేధం విధించారు. మొత్తానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..